కౌశల్ దీక్షాంత్
సమారోహ్–2026లో ప్రతిభ
కంచరపాలెం: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌లో కౌశల్ దీక్షాంత్ సమారోహ్–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 33 జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ప్రభుత్వ పాత ఐటీఐకి చెందిన మెకానిక్ డీజిల్ ట్రేడ్ విద్యార్థి పుట్టా అమృతరావు దక్షిణ భారత స్థాయిలో ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారు. అమృతరావు సాధించిన విజయం ఆయన కృషి, పట్టుదల, నైపుణ్యానికి నిదర్శనమని కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపాల్ ఎన్.సోలమాన్ పేర్కొన్నారు. ఈ విజయం ఇతర ఐటీఐ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. అమృతరావుకు శిక్షణ అందించిన బోధనా సిబ్బందితో పాటు ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.


