న్యాయవాది గీతా ప్రసన్నకు మరో షాక్‌ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాది గీతా ప్రసన్నకు మరో షాక్‌

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

● సీతమ్మధారలోని ఆమె నివాసంలో 18 మద్యం బాటిళ్లు స్వాధీనం ● ఎకై ్సజ్‌ చట్టం కింద మరో కేసు నమోదు

ఎంవీపీకాలనీ: సైబర్‌ క్రైమ్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న న్యాయవాది చందన గీతా ప్రసన్నకు మరో షాక్‌ తగిలింది. ఆమె నివాసంలో మద్యం బాటిళ్లు లభ్యమవడంతో ఎకై ్సజ్‌ చట్టం కింద మరో కేసు నమోదైంది. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌లోని ఆమె ఫ్లాట్‌ లో 18 మద్యం బాటిళ్లను ఎంవీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త శివనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జారీ చేసిన సెర్చ్‌ వారెంట్‌తో గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆక్సిజన్‌ టవర్స్‌లోని ఏ బ్లాక్‌ ఫ్లాట్‌ నంబర్‌ 2409లో సోదాలు నిర్వహించారు. ఏ–1గా ఉన్న చందన గీతా ప్రసన్న, ఏ–4గా ఉన్న ఆమె భర్త శివనారాయణ నివాసంలో వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. సాక్షుల సమక్షంలో సెర్చ్‌ అండ్‌ సీజర్‌ పంచనామా నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మద్యం బాటిళ్లు, పంచనామా పత్రాలను తదు పరి చర్యల నిమిత్తం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు గీతా ప్రసన్న, శివనారాయణ లపై ఆంధ్రప్రదేశ్‌ ఎకై ్సజ్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తును ఎస్‌ఐ సీతారాంకు అప్పగించారు. ప్రస్తుతం గీతా ప్రసన్న, భర్త శివనారాయణ రిమాండ్‌లో ఉండటంతో వారిని పీటీ వారెంట్‌పై మళ్లీ ఎంవీపీ పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement