తీరం అల్లకల్లోలం | - | Sakshi
Sakshi News home page

తీరం అల్లకల్లోలం

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

ఏయూక్యాంపస్‌: అర్నబ్‌ తుపాను ప్రభావంతో విశాఖ సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు తీరాన్ని బలంగా తాకుతుండగా.. ఎడతెరిపిలేని వర్షంతో బీచ్‌రోడ్డులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోస్టల్‌ బ్యాటరీ వద్ద కెరటాలు రాళ్లను బలంగా ఢీకొంటుండగా, జాలారిపేటలో తీరానికి సమీపంలోని మత్స్యకారుల గుడిసెల వరకు అలలు దూసుకొస్తున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు తీరంలోకి సందర్శకులను అనుమతించడం లేదు. ఫొటోలు, వీడియోల కోసం ఎవరూ బీచ్‌కు రావొద్దని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. మరోవైపు తీరంలోని ఇసుక తిన్నెలపై చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బడ్డీలు అలల ఉధృతికి కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడటంతో వాటిని హుటాహుటిన తరలించారు. భారీ వర్షంతో మొక్కజొన్న పొత్తులు, మురీ మిక్చర్‌, ఐస్‌క్రీమ్‌ విక్రయించే దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారు. నిత్యం సందర్శకులతో సందడిగా ఉండే సాగర తీరం తుపాను దెబ్బకు నిర్మానుష్యంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement