బీచ్‌రోడ్డు: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాలను మరింత చేరువ చేసే లక్ష్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో విశాఖలో ఎంఎస్‌ఎంఈ ఔట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పరవాడ, ఆటోనగర్, అయ్యప్పాపురం తదితర పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాంకేతిక అభివృద్ధి అవసరాలకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రుణ పథకాలు, సేవలను అధికారులు వివరించారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు రుణాలు, బ్యాంకింగ్ సేవలకు సంబంధించి తమ సందేహాలను అడగగా, బ్యాంక్ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జోనల్ చైర్మన్ పి. శోభన్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, పీఎన్‌బీ హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ మేనేజర్ అజయ్ కుమార్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.


