నేడు బీచ్‌ రోడ్డులో ప్రపంచ గుడ్డు దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు బీచ్‌ రోడ్డులో ప్రపంచ గుడ్డు దినోత్సవం

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

ఏయూక్యాంపస్‌: ప్రపంచ గుడ్డు దినోత్సవం 30వ వార్షికోత్సవాన్ని శుక్రవారం బీచ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించనున్నట్లు నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ(నెక్‌) జోనల్‌ చైర్మన్‌ టి.శ్రీధర్‌ తెలిపారు. బీచ్‌ రోడ్డులో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఆర్కే బీచ్‌ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి గుడ్డుతో తయారుచేసిన రుచికరమైన వివిధ రకాల వంటకాలను సబ్సిడీ ధరలతో ప్రజలకు అందిస్తామన్నారు. వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌.మాధవ్‌ తదితర ప్రజాప్రతినిధులను ఆహ్వానించామన్నారు. నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పూర్వ జోనల్‌ చైర్మన్‌ భరణికాన రామారావు మాట్లాడుతూ ‘ప్రోటీన్‌ను అందిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది’ అనే నినాదంతో ఈ ఏడాది గుడ్డు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ స్టేట్‌ ట్రెజరర్‌ టి.యు.భాస్కర్‌, రీజినల్‌ ప్రెసిడెంట్‌ బి.సాయినాథరావు, నెక్‌ జోనల్‌ కో ఆర్డినేటర్‌ ఎం.వి.అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement