ఏడుగురు పోలీస్‌ సిబ్బందికి ఘన వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఏడుగురు పోలీస్‌ సిబ్బందికి ఘన వీడ్కోలు

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

అల్లిపురం: నగర పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీస్‌ సిబ్బందిని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి బుధవారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. నగర పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఏఎస్‌ఐ పి.సి.హెచ్‌.శేఖర్‌, ఏఆర్‌ఎస్‌ఐలు ఎన్‌.శ్రీనివాసరావు, కె.వి.ఆర్‌.కె.రాజు, ఏఆర్‌హెచ్‌సీ ఆర్‌.మాధవరావు, హెచ్‌సీలు బి.వై.నాయుడు, డి.శంకరరావు, వి.వెంకటరావులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో 40 ఏళ్లకు పైగా సేవలందించడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సిబ్బంది సేవలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement