ఫార్మా పరిశ్రమ ఉద్యోగి ఆకస్మిక మృతి | - | Sakshi
Sakshi News home page

ఫార్మా పరిశ్రమ ఉద్యోగి ఆకస్మిక మృతి

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

పరవాడ: జేఎన్‌ ఫార్మాసిటీలోని వసుధా ఫార్మా యూనిట్‌–3లో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కలిశెట్టి రమేష్‌(36) బుధవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగా ఆకస్మికంగా మృతి చెందాడు. పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా గుర్ల మండలం గొలగాం గ్రామానికి చెందిన రమేష్‌ గాజువాకలో నివాసం ఉంటున్నాడు. బుధవారం బి షిఫ్ట్‌ విధులకు హాజరైన రమేష్‌ షిఫ్ట్‌ మారే సమయంలో తల తిరుగుతోందని చెప్పి కుప్పకూలాడు. వెంటనే పరిశ్రమలోని ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అగంనపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. రమేష్‌కు తీవ్రంగా చెమటలు పట్టడంతోపాటు వాంతులు కూడా వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారని సీఐ పేర్కొన్నారు. గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రమేష్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement