5న విశాఖకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

5న విశాఖకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

సాక్షి, విశాఖపట్నం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 5, 6 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. 5న సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని నేవీ అధికారుల ముఖాముఖి, బడాఖానా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6న ఉదయం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్లిప్‌వే–4ను ప్రారంభించడంతోపాటు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)–4 కీ లేయింగ్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌–1 జలప్రవేశ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఒడిశాలోని సునాబేడకు వెళ్లి, సాయంత్రం విశాఖ మీదుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement