తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీ)లు తెలిపిన వివరాలు.. ఆదివారం సాయంత్రం విశాఖ రైల్వేస్టేషన్ నుంచి మర్రిపాలెం స్టేషన్ మధ్య డౌన్‌లైన్, అప్‌లైన్ మధ్యలో రైల్వే కోచింగ్ కాంప్లెక్స్ వద్ద మృతదేహం కనిపించింది. మృతునికి సుమారు 42–45 ఏళ్ల వయస్సు ఉంటుంది. సుమారు 5.4 అడుగుల ఎత్తుతో చామన చాయ రంగు కలిగి ఉన్నాడు. తెలుపు రంగు, దానిపై నీలం, ఆకుపచ్చ రంగు చెక్స్‌తో ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్, బూడిద రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహం సమీపంలో ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఏదైనా రైలు నుంచి ప్రమాదవశాత్తూ పడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ డి.దీనబంధు ఆదేశాల మేరకు ఎస్‌ఐ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు విశాఖ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ సిబ్బందికి స్వయంగా, లేదా 93463 48929/92475 85737 నెంబర్లలో తెలియజేయవచ్చన్నారు.


