విశాఖ విద్య: గుర్తు తెలియని వృద్ధురాలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ద్వారకా పోలీసులు తెలిపారు. వివరాలు.. సుమారు 65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధురాలు, ఈ నెల 13న ద్వారకానగర్ మూడో లైన్‌లోని యాపిల్ డెంటల్ ఆస్పత్రి వద్ద అపస్మారక స్థితిలో ఉంది. అక్కడున్న వారు 112 ద్వారా పోలీసులకు తెలిపారు. పోలీసులు స్పందించి 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. దీంతో పేరు, చిరునామా తదితర విషయాలేవీ తెలుసుకోలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించినట్లు వెల్లడించారు. ఆమె గురించి తెలిసిన వారు ద్వారకా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా ఎస్‌ఐ సంతోష్ కోరారు.


