ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
డాబాగార్డెన్స్: రానున్న జీవీఎంసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వార్డుల విస్తరణ, డీలిమిటేషన్‌పై అందుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, పేర్లు మినహాయింపు లేదా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి జోన్‌కు కార్యాచరణ రూపొందించి, పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని అదనపు కమిషనర్‌కు సూచించారు.


