ఆరిలోవ: సీపీఎం మద్దిలపాలెం జోన్ ఆధ్వర్యంలో ఆరిలోవలోని నీటి సరఫరా విభాగం కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటకం స్థానికులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక ఆలోచింపజేసింది. ధర్నాలో సీపీఎం వయోధిక నాయకుడు ‘దాహం.. దాహం..’ అంటూ అభినయించిన తీరు ఆకట్టుకుంది. తీవ్ర దాహంతో అల్లాడిపోతూ ఆయన ఇంటింటికీ వెళ్లి తాగునీరు అడిగినా.. ఏ ఇంట్లోనూ నీళ్లు లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలు చూపించారు. ఓ మహిళ బిందె బోర్లించినా గుక్కెడు నీరు కూడా రాకపోవడంతో, తీవ్ర దాహంతో ఆ వృద్ధుడు సొమ్మసిల్లి కూలబడతాడు. ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ ప్రదర్శన, చూపర్లను తీవ్రంగా కలచివేసి కంటతడి పెట్టించింది.
స్కిట్‌లో ఓ దృశ్యం


