ఆహార భద్రత పథకాల అమలు పక్కాగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత పథకాల అమలు పక్కాగా ఉండాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

మహారాణిపేట: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆహార భద్రత పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఇ.లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్‌దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెదవాల్తేరు–2, ఆదర్శ్‌నగర్‌–1, పెద్దజాలారిపేట అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, గుడ్లు, పాలు, నూనె, రేషన్‌ సరుకుల నిల్వలు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. ఆదర్శ్‌నగర్‌–1 అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్ల కొరత, స్టాక్‌ రిజిస్టర్లు–భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాలు, దెబ్బతిన్న గుడ్లను గుర్తించి అధికారులకు సూచనలు చేశారు. చిన్నబుచ్చిరాజుపాలెం ఎంపీపీ పాఠశాలలో పాత బ్రౌన్‌ గుడ్లు నిల్వలో ఉండటాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పెదవాల్తేరు, పెద్దజాలారిపేట రేషన్‌ దుకాణాలతో పాటు సర్కిల్‌–1 ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను పరిశీలించి బియ్యం నిల్వలు, ఈ–పాస్‌ యంత్రాల నిర్వహణ, రికార్డులను తనిఖీ చేశారు.

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన

రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement