మద్యం కోసం గొడవ రైలు కిందపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

మద్యం కోసం గొడవ రైలు కిందపడి వ్యక్తి మృతి

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

అక్కిరెడ్డిపాలెం : స్థానిక గవర జగ్గయ్యపాలెం క్యాబిన్‌ సమీపంలోని రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం గవర జగ్గయ్యపాలెంకు చెందిన ఆళ్ల సత్తిబాబు (45) మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవపడి ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి రైలు పట్టాలపై పడి మృతి చెందాడు. రైలు ఢీకొనడంతో మృతుడి తల, మొండెం వేరువేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement