కంచరపాలెం: విశాఖలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కెప్టెన్ కంభంపాటి సుజాత శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల శ్రీలంకలోని ఎంఐటీఎల్ క్యాంపస్, బొరలెస్గమువలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె పలు అంశాలపై ప్రధానోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు కీనోట్ స్పీకర్ గౌరవం, ఇండో–శ్రీలంక రీసెర్చ్ ఎక్స్‌లెన్స్ అవార్డు–2026, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్ గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. డాక్టర్ కంభంపాటి సుజాత సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ, అధ్యాపకులు, యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.


