ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రైవేటుపరం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రైవేటుపరం చేయొద్దు

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

ర్టీసీని ప్రైవేటుపరం చేయడాన్ని, ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ (ఆర్టీసీ) జేఏసీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని డిపోల ఉద్యోగుల సంతకాలతో కూడిన బుక్‌లెట్‌ను జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరికి జేఏసీ కన్వీనర్లు ఏ.కె.శివాజీ, జి.తాతాలు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ’సీ్త్ర శక్తి’ పథకం కోసం కొత్తగా 4 వేల బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నడపాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లుగా నియామకాలు లేక ఉద్యోగులు డబుల్‌ డ్యూటీలు చేస్తున్నారని, తక్షణం 15 వేల ఖాళీలను భర్తీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి.వి.వి.మోహన్‌, జె.ఎం.నాయుడు, అల్లు సురేష్‌ నాయుడు, సత్యవతి, జిల్లా అధ్యక్షుడు పి.ఎన్‌.మూర్తి, జిల్లా చైర్మన్‌, ప్రాన్‌ మాజీ జోనల్‌ కార్యదర్శి ఎం.వి.ఆర్‌.మూర్తి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.రాంబాబు, డివిజన్‌ చైర్మన్‌ ఎస్‌.వి.రమణ, అన్ని డిపోల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement