పోర్టు కార్మికులంతా ఐక్యంగా పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

పోర్టు కార్మికులంతా ఐక్యంగా పోరాడాలి

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

డాబాగార్డెన్స్‌: పోర్టు రంగంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు శాశ్వత, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూటీడబ్ల్యూఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ నరేంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన అఖిల భారత ప్రధాన, చిన్న పోర్టు కార్మికుల రెండో రోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, సామాజిక భద్రత కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. డబ్ల్యూటీడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు సీడీ నందకుమార్‌, జాతీయ ఉపాధ్యక్షుడు రసల్‌, సంయుక్త కార్యదర్శి సమర మండల్‌, బి. జగన్‌ మాట్లాడుతూ పోర్టు రంగంలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, నాన్‌–పర్మనెంట్‌ కార్మికుల సమస్యలు, వేతన ఒప్పందాలు, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, భద్రతా ప్రమాణాలు, జాతీయ స్థాయి ఉద్యమాల నిర్మాణం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మణి, విశాఖ పోర్టు నాయకులు కె.సత్యనారాయణ, జక్కన సత్యనారాయణ, సాంబమూర్తి, త్రినాథరావు, వెంకట్రావు, అప్పలరాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement