ఏసిప్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

ఏసిప్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు శంకుస్థాపన

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

ఆనందపురం: మండలంలోని తర్లువాడ పంచాయతీ పరిధిలో అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏసిప్‌) టెక్నాలజీస్‌ సెమీకండక్టర్‌ యూనిట్‌కు శనివారం శంకుస్థాపన జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయం నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏసిప్‌ ప్రతినిధులు స్థానికంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి, ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ సీఈవో అమితేష్‌ కుమార్‌ సిన్హా, రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని, ప్రత్యేక కార్యదర్శి ఎం.సూర్యతేజ, ఏసిప్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో వెంకట సింహాద్రి, ఏపీఈడీబీ ప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement