అలలై అభిమానం | - | Sakshi
Sakshi News home page

అలలై అభిమానం

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

అభివాదం

చేస్తున్న

వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖపట్నంలో గురువారం అపూర్వ స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తగరపువలస వరకు రహదారులన్నీ అభిమానులు, పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం ఏమాత్రం తగ్గలేదు. రహదారులకు ఇరువైపులా నిలబడి ప్రజలు చేతులు ఊపుతూ జననేతకు అభివాదం చేయగా, వైఎస్‌ జగన్‌ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ ప్రతిస్పందించారు. పలు కూడళ్లలో డీజేలు, నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలకడంతో పండగ వాతావరణం నెలకొంది. పర్యటన సందర్భంగా మార్గమధ్యంలో పలువురు ప్రజలు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ కార్మికులు, కాందిశీకులు, పంచగ్రామాల ప్రజలు, డేటా సెంటర్‌ భూ నిర్వాసిత రైతులు వినతిపత్రాలు అందజేశారు. భూములు ఇచ్చినా ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు గంటల పాటు సాగిన పర్యటన

ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన రోడ్డు మార్గ పర్యటన ఎన్‌ఏడీ జంక్షన్‌, గోపాలపట్నం, అడవివరం, సత్తరువు జంక్షన్‌, నీళ్లకుండీలు, ఆనందపురం, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలో ఈ పర్యటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.35 గంటలకు ఎమ్మెస్సార్‌ ఫంక్షన్‌ హాల్‌ జంక్షన్‌ దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగించుకుని రాత్రి 8.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూర్‌కు బయలుదేరారు.

పోలీసుల ఆంక్షలు.. అభిమానుల ఉత్సాహం

వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. పర్యటన మార్గమంతా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ సీఎంను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, పార్టీ శ్రేణులను ఎయిర్‌పోర్టు వద్ద నిలువరించడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కార్యకర్తలతో కలిసి లోపలికి వెళ్లారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వాహనాన్ని ఎయిర్‌పోర్టు వైపు వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడంతో ఆయన కాలినడకనే విమానాశ్రయానికి చేరుకున్నారు.

కాన్వాయ్‌ను అడ్డుకున్నా ఆగని అడుగులు

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు వేసి సుమారు అరగంటపాటు ఎయిర్‌పోర్టు వద్ద నిలిపివేశారు. వాహనాలు నిలిపివేసినా తమ అధినేతను అనుసరించేందుకు పలువురు నాయకులు కాలినడకనే కాన్వాయ్‌ వెనుక బయలుదేరారు. చివరకు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెళ్లిన అరగంట తర్వాతే ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆంక్షలు ప్రజల ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి.

ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌కు పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్‌, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, బొడ్డేడ ప్రసాద్‌, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, వరుదు కల్యాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, సమన్వయకర్తలు దేవన్‌ రెడ్డి, మళ్ల విజయప్రసాద్‌, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పెట్లా ఉమాశంకర్‌ గణేష్‌, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అదీప్‌రాజ్‌, తైనాల విజయ్‌కుమార్‌, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మహిళా నేత సిరి సహస్ర, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కె.సతీష్‌, మాజీ మంత్రి బాలరాజు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, వీసం రామకృష్ణ, గండి రవి తదితరులు స్వాగతం పలికారు.

నీళ్లకుండీల జంక్షన్‌ వద్ద

గోపాలపట్నం వద్ద

అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన అభిమానులు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తగరపువలస వరకు పోటెత్తిన జనం పోలీసుల ఆంక్షలను లెక్కచేయని కార్యకర్తలు, అభిమానులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement