మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 2025 సంవత్సరానికి ఉత్తమ పాలిటెక్నిక్ అవార్డు శుక్రవారం అందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎస్‌టీఈ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ ప్రకటించిన ఈ అవార్డును అనంతపురం జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేవీ రమణకు అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌టీఈ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ చైర్మన్ ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన్, కార్యదర్శి ప్రొఫసర్ బి.ఈశ్వర్‌రెడ్డి, ఏఐటీఏఎం చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, డైరెక్టర్ కె.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


