నగరంలో ‘డెకాయిట్‌’ సందడి | - | Sakshi
Sakshi News home page

నగరంలో ‘డెకాయిట్‌’ సందడి

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

మహారాణిపేట: ‘డెకాయిట్‌’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర హీరో అడవి శేష్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ శుక్రవారం నగరంలో సందడి చేశారు. ఆశీలమెట్టలో ఉన్న సంపత్‌ వినాయగర్‌ ఆలయాన్ని సందర్శించి, స్వామిని దర్శించుకున్నారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించిన అడవి శేష్‌ విశాఖపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘వైజాగ్‌ నాకు లక్కీ సిటీ. ఇక్కడి వాతావరణం, ప్రజలు అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌లు చేసుకుంటూ.. విశాఖలో సెటిల్‌ అవ్వాలని ఉంది’ అని తన మనసులోని మాటను పంచుకున్నారు. అడవి శేష్‌, మృణాల్‌లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రుబరూ పాటకు హీరోహీరోయిన్లు డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement