ఏపీటీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా వాసుపల్లి
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్ (ఏపీటీయూ) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గురువారం అక్కయ్యపాలెంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.దేవుడు అధ్యక్షతన జరిగిన అత్యవసర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను, రాష్ట్ర అధ్యక్షుడిగా వై.దేవుడును ఎన్నుకున్నారు. వీరితో పాటు 18 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ను యూనియన్ నేతలు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా హరికృష్ణ, నాయకులు కె.జె కృపానందం, కె.బ్రహ్మారెడ్డి, కె.వెంకటేశ్వర్లు, గౌరీశంకర్ పాల్గొన్నారు.


