మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక

మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక

కొమ్మాది: 2026లో 2.1 మిలియన్ల పర్యాటకులు సందర్శించే లక్ష్యంతో మలేషియా టూరిజాన్ని విస్తరించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మలేషియా టూరిజం చైర్మన్‌ దాతూక్‌ మనోహరస్‌ పెరియసామి అన్నారు. సాగర్‌నగర్‌లో ఉన్న రాడిసన్‌ బ్లూ రిసార్టులో సోమ వారం మలేషియా అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ భాగస్వామ్యంతో జరిగిన టూరిజం మలేషియా సేల్స్‌ మిషన్‌–2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వాములను పటిష్టం చేసి విభిన్న పర్యాటక శాఖలను ప్రోత్సహించడంపై మలేషియా దృష్టి సారించిందన్నారు. దక్షిణ భారతంలో టూరిజం మలేషియా ఉనికిని విస్తరించడం.. తద్వారా మార్కెట్‌లో మలేషియా భాగస్వామ్యం బలోపేతం చేయడమే ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం అన్నారు. 2024లో 13,65,387 మంది పర్యాటకులు మలేషియాను సందర్శించగా 2025లో 15,65,194 మంది సందర్శించారన్నారు. 2026లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్‌, మలేషియా దేశాల మధ్య పర్యాటకుల డిమాండ్‌కు మద్దతుగా దేశంలోని 14 నగరాల నుంచి 47,399 సీట్ల కెపాసిటీతో 238 డైరెక్ట్‌ వీక్లీ విమానాలతో అనుసంధానం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టూరిజం మలేషియా ఇంటర్నేషనల్‌ ప్రమో షన్స్‌ విభాగం సీనీయర్‌ డైరెక్టర్‌ నువాల్‌ ఫాథిలా బింటీ, హిషాముద్దీస్‌ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement