సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు వస్తాయని తెలిసినా, యువతలో మార్పు రావడం లేదు. ఆదివారం సాగర తీరంలో ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తూ సాగిన ఈ ప్రయాణం పర్యాటకులను విస్మయానికి గురిచేసింది. మూడు ద్విచక్ర వాహనాలపై యువతీ యువకులు ‘ట్రిపుల్ రైడింగ్’ చేస్తూ అత్యంత వేగంతో దూసుకుపోయారు.
ఒక్కో బైకుపై ముగ్గురేసి చొప్పున కూర్చుని, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బీచ్ రోడ్డులో హల్‌చల్ చేశారు. చిత్రమేమిటంటే ఈ మూడు వాహనాలపై వెనుక కూర్చున్న వారు యువతులే కావడం గమనార్హం. హెల్మెట్ లేకపోగా, ముగ్గురు కూర్చుని అతి వేగంగా వెళ్లడం వల్ల ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి విన్యాసాలపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సందర్శకులు కోరుతున్నారు.
– : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


