జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 95 అర్జీలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యలతో కలిసి కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 52 అందగా, ఇంజినీరింగ్‌కు 13, రెవెన్యూకు 11, ప్రజారోగ్య విభాగానికి 9, అడ్మినిస్ట్రేషన్‌కు 6, మొక్కల పెంపకానికి 2, యూసీడీ విభాగానికి 2 వినతులు వచ్చాయి.


