14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల | - | Sakshi
Sakshi News home page

14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల

Feb 5 2026 7:10 AM | Updated on Feb 5 2026 7:10 AM

14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల

14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల

మహారాణిపేట: ఇండియన్‌ నేవీ నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌), మిలాన్‌ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు నేవీ నౌకలు, బోట్లు నిలిపే ప్రాంతాల్లో చేపల వేట, మత్స్యకార బోట్ల సంచారంపై నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు మూలపాలెం గ్రామంలో మత్స్యకారులకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రపంచ ప్రసిద్ధ కార్యక్రమాల సమర్థ నిర్వహణకు మత్స్యకారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బీచ్‌లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. మత్స్యశాఖ జేడీతోపాటు ఎఫ్‌డీవో మురళి, మైరెన్‌ పోలీసులు బీకేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌, నేవీ అధికారులు మధుసూదన్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ నేపథ్యంలో

మత్స్యకారులకు విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement