ఆటలొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆటలొద్దు

Feb 1 2026 7:23 AM | Updated on Feb 1 2026 7:23 AM

ఆటలొద

ఆటలొద్దు

భక్తుల మనోభావాలతో

● 49వ వార్డు ఎన్జీఓస్‌ కాలనీలోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం విషప్రచారాన్ని తిప్పికొడుతూ కొబ్బరికాయలు కొట్టారు. రాజకీయ స్వలాభం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.

● విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో సీతమ్మధారలో త్రిమూర్తిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దని, ఇప్పుడైనా దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు తమ తప్పు అంగీకరించి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్‌ చేశారు.

● భీమిలి సమీపంలోని కీతిన్‌ పేటలోని ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం బయట నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలు ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.

తి

రుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అసత్య ఆరోపణల వల్ల కలిగిన అపచారాన్ని తొలగించేందుకు వైఎస్సార్‌ సీపీ జిల్లా వ్యాప్తంగా ‘పాప ప్రక్షాళన పూజల’కు శ్రీకారం చుట్టింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సీబీఐ విచారణలో తేలిన నేపథ్యంలో.. స్వామివారికి జరిగిన మహాపచారానికి ఆధ్యాత్మి కంగానే సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు అండ్‌ కో నిజాలను అంగీకరించకుండా భక్తులను మభ్యపెడుతున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దైవత్వాన్ని మంటగలిపిన కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఈ శాంతి పూజలు నిర్వహించారు. –సాక్షి, విశాఖపట్నం

● గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీహెచ్‌బీవీ ప్రసన్న వేంకటేశ్వరరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవన్‌ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మండిపడ్డారు.

● పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో పెందుర్తిలో వేంకటాద్రి కొండ మీద వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదీప్‌ రాజ్‌ మాట్లాడుతూ తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

● విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలో 59వ వార్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూలను పంపిణీ చేశారు. మళ్ల మాట్లాడుతూ ఈ పూజల ద్వారా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు.

హిందువులకు చంద్రబాబు, పవన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

హామీలు అమలు చేయలేక తప్పుడు ప్రచారాలు చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు

ఆటలొద్దు1
1/5

ఆటలొద్దు

ఆటలొద్దు2
2/5

ఆటలొద్దు

ఆటలొద్దు3
3/5

ఆటలొద్దు

ఆటలొద్దు4
4/5

ఆటలొద్దు

ఆటలొద్దు5
5/5

ఆటలొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement