వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు

Jan 31 2026 5:58 AM | Updated on Jan 31 2026 5:58 AM

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురుకు చోటు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సేనాపతి అప్పారావు (విశాఖ నార్త్‌), రాష్ట్ర మహళా విభాగం కార్యదర్శిగా తోనంగి రమణమ్మ (విశాఖ పశ్చిమ), రాష్ట్ర అంగన్‌వాడీ వింగ్‌ కార్యదర్శిగా గొలగాని లక్ష్మి (విశాఖ తూర్పు)ను నియమించారు.

జిల్లా అనుబంధ విభాగాల వింగ్‌..

వైఎస్సార్‌ సీపీ జిల్లా అనుబంధ విభాగం క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌గా నడిగట్టు రాజశేఖర్‌, జిల్లా యూత్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా పల్లా శ్రీనివాస్‌, జిల్లా యూత్‌ వింగ్‌ కార్యదర్శిగా నక్కన రాజ్‌ కమల్‌ యాదవ్‌, జిల్లా ఐటీ వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా శివనారాయణ కోరుబుల్లి, జిల్లా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా చొక్కాకుల అర్జున్‌, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శిగా అనసూరి రమేష్‌బాబు, జిల్లా వలంటీర్‌ విభాగం ప్రధాన కార్యదర్శిగా రవికృపానంద, జిల్లా వలంటీర్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా బెల్లాన గణేష్‌, జిల్లా మైనారిటీ సెల్‌ కార్యదర్శిగా మహమ్మద్‌ ఖాజా, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా కాకర వీరస్వామి, జిల్లా సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శులుగా పక్కల నిర్మల ఆనంద్‌, జిల్లా సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శిగా ప్రేమ్‌కుమార్‌, జిల్లా మున్సిపల్‌ వింగ్‌ కార్యదర్శిగా ఎ. ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement