అప్పుల బాధ తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య
గాజువాక: అప్పుల బాధ తాళలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన ముదునూరు మోహన్‌రాజు(39) కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడం, దానికి తోడు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌రాజు.. గాజువాకలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. శనివారం లాడ్జిలో దిగిన ఆయన, ఆదివారం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మోహన్‌రాజు గదిలో ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


