విశాఖ : ఏపీ-తెలంగాణ రాష్ట్రాల జలవివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాల్సిన వాటాలో నష్టం జరుగుతుందని మాధవ్ స్పష్టం చేశార. మన నీటి వాటా.. మన హక్కు అని.. నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలన్నారు.
చాలా మంది నిపుణులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి సలహాలు తీసుకోవాలన్నారు. మన నీటి సమస్యను సరైన రీతిలో వివరించాలి.. వాదన వినిపించాలని ఆయన సూచించారు.



