పోర్ట్‌లో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
విశాఖ సిటీ : విశాఖ పోర్ట్ అథారిటీని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సభ్యులకు పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి వివిధ విభాగాల అధిపతులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం పోర్ట్‌లో పర్యటించారు. పోర్ట్ సమగ్ర కార్యకలాపాలు, చేపడు తున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను డిప్యూ టీ చైర్‌పర్సన్ వివరించారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ, యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదే విధంగా విశాఖ పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టు బడి అవకాశాలు, సాధ్యమైన మార్గాలను తెలియ జేశారు. పోర్ట్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.


