విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం: పండగ వేళ విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజనల్ అధికారులు తెలిపారు. విశాఖ–చర్లపల్లి(08513) స్పెషల్ ఈ నెల 18 రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–విశాఖపట్నం(08514) స్పెషల్ ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ స్పెషల్ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజవాయడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.


