వైఎస్సార్ సీపీలో విశాఖ నేతలకు కీలక పదవులు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగం కమిటీలో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎల్.రమణమ్మ(విశాఖ దక్షిణ), బీసీ సెల్ కార్యదర్శులుగా నూకవరపు మైకిల్(విశాఖ దక్షిణ), రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా గంట్యాడ గురుమూర్తి(గాజువాక), రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శులుగా వాక శ్రీనివాస రెడ్డి(విశాఖ ఉత్తర), యొమ్మి చిన్నారావు(విశాఖ దక్షిణ), గాదె రోషిరెడ్డి(భీమిలి) నియమితులయ్యారు. జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల వింగ్ అధ్యక్షుడిగా చుక్కా పైడిరాజు(విశాఖ పశ్చిమ), జిల్లా విద్యార్థి వింగ్ ప్రధాన కార్యదర్శిగా కుప్పిలి ప్రసాద్‌బాబు(విశాఖ తూర్పు), విద్యార్థి వింగ్ కార్యదర్శిగా దాడి సంతోష్‌కుమార్(గాజువాక), జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా శివకళ దుర్గా ప్రసాద్(విశాఖ తూర్పు), జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా చంద్రపాటి ఈశ్వర్‌రావు(గాజువాక), జిల్లా ఆర్టీఐ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రామిరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డి(గాజువాక), జిల్లా గ్రీవెన్స్‌సెల్ కార్యదర్శులుగా గాలి సునీల్‌కుమార్(గాజువాక), జి.సాయి శివ కుమార్(గాజువాక), బైరెడ్డి శ్రీనివాసరావు(గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా రాయి గిరి(గాజువాక), వైఎస్సార్ టీయూసీ జిల్లా కార్యదర్శిగా దాము రోతు అప్పలరాజు(గాజువాక)లను నియమించారు.


