దెబ్బతింటున్న అసలు ఉద్దేశం..!
చెత్త భూమిపై పడకుండా నేరుగా కాంపాక్టరులోకి.. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ ప్లాంటులోని బాయిలరులో వేయడమే ఈ సీసీఎస్ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. చెత్త ఎక్కడా బయట కనపడకుండా చూడటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమూ ఇందులో భాగం. అలాగే చెత్త తరలించేటప్పుడు రోడ్డుపై పడకుండా చూడాలనేది కూడా ఓ లక్ష్యం. అయితే చంద్రబాబు ప్రభుత్వం సీసీఎస్ వాహనాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతుంది. అధికారుల తీరు కూడా ఆడింది ఆట.. పాడిందే పాటగా తయారయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాజువాక సీసీఎస్‌లో...


