పెందుర్తిలో గంజాయి పట్టివేత
పెందుర్తి: ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరం మీదుగా కేరళకు తరలిస్తున్న మూడున్నర కిలోల గంజాయిని పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళకు చెందిన జోస్ ఫెలిక్స్ అలియాస్ వలాన్ పులి(38), జతిన్ కలిస్టస్ అలియాస్ బాంబ్ జతిన్(30) ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని సేకరించారు. బుధవారం రైలులో పెందుర్తి మీదుగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పెందుర్తి ఎస్‌ఐ షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద కాపుకాసి నిందితులను పట్టుకున్నారు. గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.


