విశాఖ : తమ భవిష్య కార్యాచరణ అంతా పోరాలాలేని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు స్పష్టం చేశారు. తమ భవిష్యత్ అంతా పోరాటమేనన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కార్మిక వ్యతిరేక చట్టాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడే ఎక్కువ పోరాటాలు చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మె ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలన్నారు. సీఐటీయూ మహా సభలను జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
సీఐటీయూ18వ అఖిల భారత మహాసభలు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో జరిగాయి. ఈ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా సుమారు 1,300 ప్రతినిధులు హాజరయ్యారు.కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, మరియు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, ప్రజా సమస్యలు, కార్మిక హక్కులు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కార్మిక ఉద్యమాల అనుభవాలు పంచుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. చివరి రోజైన ర్యాలీతో పాటు ప్రజా సభ నిర్వహించారు.


