అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు, రిఫరీలు
సింహాచలం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం పలువురు క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు దర్శించుకున్నారు. క్రికెటర్లు వి. కృతిక, నియతి లోకూర్ సహా బీసీసీఐ రిఫరీలు, అధికారులు శివశుక్లా, చేతన్ శర్మ, సుబ్రత దాస్, అభిషేక్ తోమర్, రాకేష్ కుమార్ తదితరులు స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు.


