
చాపరాయికి పోటెత్తారు
డుంబ్రిగుడ: వీకెండ్ కావడంతో సందర్శకులు పోటెత్తారు. చాపరాయి జలవిహారి సందర్శనకు శనివారం భారీగా తరలివచ్చారు. అయితే భారీ వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగే అవకాశం ఉన్నందున కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా సందర్శకులను నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో వారంతా నిరాశకు గురయ్యారు. చాపరాయి జలవిహారి ప్రాంతంలో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఫొటోలు దిగారు. ముఖద్వారం వద్ద స్థానిక థింసా కళాకారులతో కలిసి సందడి చేశారు. కొంత మంది పర్యాటకులు గిరిజన వస్త్రధారణలో ముస్తాబై ఫొటోలు తీసుకున్నారు.