
సాక్షి,విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోతుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ యాజమాన్యం.. సెప్టెంబర్ 9వ తేదీ టెండర్ల దాఖలకు ఆఖరి తేదీ విధించింది.
ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విధానంలో1)టీపీపీ, 2) ఎస్ ఎం ఎస్-1&2, 3)ఎంఎంఎస్ఎం, 4)ఎస్బిఎం, 5)డబ్ల్యూఆర్ఎం-1&2, 6) మాదారం మైన్స్, 7) రోల్‌షాప్‌అండ్ రిపేర్ షాప్ -1&2, 8) సిఎంఎస్, 9) ఫౌండ్రీ, 10)ఎస్‌టీఎం, 11)ఈఎన్ఎండి, 12) బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3లను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లను పిలిచింది.