ఇథలిన్‌తోనే పళ్లు మగ్గబెట్టాలి
సీజన్ ఊపందుకోవడంతో జిల్లాలో రైతులు మామిడి దింపుడు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పక్వానికి వచ్చిన మామిడిని తగిన జాగ్రత్తలు తీసుకుని మగ్గబెట్టాలి. మామిడి పండ్లను కాల్షియం కార్బేట్ సహాయంతో మగ్గబెట్టడం మంచిది కాదు. దీని వలన ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. పక్వానికి వచ్చిన మామిడి పళ్లను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. మామిడి కాయలను గాలి చొరబడని గదిలో ఉంచాలి. తర్వాత ఇథలిన్ వాయువును 2 పీపీహెచ్ మోతాదులో స్ప్రే చేసి 16 గంటల తరువాత తీయాలి. ఇలా చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన మామిడి పండ్లు లభిస్తాయి. లేదా బకెట్ నీటిలో ఇథలిన్ ద్రావణం, క్లాస్కిక్ సోడా కలిపి చల్లిన తర్వాత 24 గంటలు ఉంచాలి. దీని వలన ఇథలిన్ వాయువు విడుదలై మామిడి కాయలు మగ్గుతాయి.
– జి.సోని, ఉద్యానశాఖ అధికారి


