సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం 21 రోజులకు రూ.కోటీ 57 లక్షల 71 వేల 152 వచ్చినట్లు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహగిరిపై బుధవారం స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 63 గ్రాముల బంగారం, 9.725 కిలోల వెండి లభించిందన్నారు. అన్నప్రసాద భవనంలోని హుండీ ద్వారా లక్షా 75 వేల 780 రూపాయలు లభించినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.