అజయ్(ఫైల్)
● పెళ్లయిన నెల రోజులకే యువకుడి మృతి
చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్ర గాయాలు పాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలంకు చెందిన ఇందుకురు కృష్ణంరాజు(37) సోమవారం రాత్రి ఏయూ గేట్ వద్ద ఉన్న వెంకటాద్రి రెస్టారెంట్‌కు టిఫిన్ కోసం వెళ్లారు. టిఫిన్ చేసి రోడ్డు దాటుతుండగా సిరిపురం వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఆయన్ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణంరాజును ఒక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పీఎంపాలెం(భీమిలి): విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తోట అజయ్(24) శుభకార్యా లు, పండగల నిర్వహణకు ఈవెంట్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈయనకు నెల రోజుల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులు స్థానిక గాయత్రినగర్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివసిస్తున్నారు. భార్య కుసుమతో కలసి అజయ్ లక్ష్మీవానిపాలెంలో నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


