
ఎంవీపీకాలనీ : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టార్‌గా కె.రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు శుక్రవారం ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పోస్టు ఖాళీగా ఉంది. ఆ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా (జేడీ) ఉన్న రమణమూర్తి ఈ విభాగ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామారావును డీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా రామారావు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు.