పూడూరు: వికారాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, సీపీఎం ఆధ్వర్యంలో దేవనోనిగూడ, సోమన్గుర్తి, కెరవెళ్లి, పూడూరు గ్రామాల్లో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు తీరని నష్టం జరిగిందన్నారు. పంట రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్పింలు, నాయకులు యాదయ్య, అనంతయ్య, నర్పింలు, నారాయణ, అనంతయ్య, మహేశ్, మల్లేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్


