సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

వార్డుల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బీఎంఆర్‌

తాండూరు: పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. 19 నుంచి 24వ వార్డు వరకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గొల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాకేష్‌రెడ్డికి సూచించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, కౌన్సిలర్లు జుంటిపల్లి వెంకట్‌, సభాఫాతిమా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement