బొంరాస్‌పేట: రాష్ట్ర స్థాయి రైతుమేళాను ఆదర్శంగా నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డితో శభాష్ అనిపించుకుందామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో సుమారు 50వేల మంది, 200 స్టాళ్లతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దుద్యాల మండలం హకీంపేట సమీపంలో కొనసాగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. రైతు మేళాలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో 200 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక వ్యవసాయం, యంత్రాలు, సాగు విధానంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. చివరి రోజు సుమారు 50వేల మందిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. కార్యక్రమంలో తాండూరు ఆర్‌డీఓ అనిత, డీఏఓ కవిత, తహసీల్దారు కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 7, 8, 9 తేదీల్లో కార్యక్రమాలు
ఆదర్శంగా నిర్వహిద్దాం
కలెక్టర్ దీపక్ తివారి
స్థల పరిశీలన చేసిన అధికారుల బృందం


