కరువు మండలాలు 38 | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాలు 38

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

సమస్యల పరిష్కారమే.. తాండూరు పరిశుభ్రత, ప్రజా సమస్యలపరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. 10లోu బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

తాగునీటి సరఫరాపై దృష్టి

సమస్యల పరిష్కారమే.. తాండూరు పరిశుభ్రత, ప్రజా సమస్యలపరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కరువు ప్రభావిత మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోటు వర్షపాతం నమోదైన మండలాలు సహా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్న మండలాలను ఈ జాబితాలో చేర్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 38 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వీటిలో 16 మండలాలను తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా, మిగిలిన మండలాలను సాధారణ కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. ఆయా మండలాల్లో తాగునీటి సరఫరా, నిత్యావసరాల పంపిణీ, యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన పంటల సాగుపై దృష్టి సారించాల్సిందిగా సంబంధిత జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాల వారీగా..

రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటిలో 18 కరువు మండలాలుగా నిర్ధారించింది. వీటిలో గండిపేట్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కొత్తూరు మండలాలను అతి తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, యాచారం, ఆమనగల్లు, కేశంపేట, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌, ఫరూఖ్‌నగర్‌, జిల్లేడు చౌదరిగూడను సాధారణ కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వికారాబాద్‌ జిల్లాలోని మొత్తం మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. వీటిలో మర్పల్లి, నవాబ్‌పేట, కుల్కచర్ల, దోమ, బంట్వారం, పెద్దేముల్‌, తాండూరు, బషీరాబాద్‌, యాలాల, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఇక మోమిన్‌పేట, వికారాబాద్‌, పరిగి, ధారూరు, బొంరాస్‌పేట, దుద్యాల, కొట్‌పల్లి, పూడూరు, చౌడాపూర్‌ మండలాలను సాధారణ కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.

వికారాబాద్‌ జిల్లాలో 20

రంగారెడ్డి జిల్లాలో 18

ప్రకటించిన ప్రభుత్వం

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు

ఆయా మండలాల పరిధిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరు తడిపంటలను సాగు చేయించేలా రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించింది. అంతేకాకుండా పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతి నెలా పేదలకు సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసరాలు సహా పశువుల మేత వంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిందిగా పేర్కొంది. ఈ మేరకు మండలాల వారీగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాల్సిందిగా స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement