నేర నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

క్యాండిల్‌ ర్యాలీ

పరిగి: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. మంగళవారం పరిగి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్తి, మహిళలు, చిన్నారుల కేసుల దర్యా ప్తులో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని సూచించారు. సైబర్‌ నేరాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, పరిగి సీఐ కొండల్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం దిశగా చదవాలి

కొడంగల్‌ రూరల్‌: క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే పోలీస్‌ ఉద్యోగం సాధించవచ్చని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌కుమార్‌, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎస్పీ స్నేహమోహ్ర

పోలీస్‌ అమరవీరుల త్యాగం ఎప్పటికీ మరచిపోలేమని ఎస్పీ స్నేహామెహ్ర అన్నారు. పోలీస్‌ ప్లాగ్‌ డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి పరిగి బస్టాండ్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు ఎన్నటికీ మరవలేనివమన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాజేష్‌మీనా, డీఎస్పీ శ్రీనివాస్‌, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement