ఓటు చోరీని అడ్డుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఓటు చోరీని అడ్డుకుందాం

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

అనంతగిరి: ఓటు చోరీని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఏఐసీసీ ఎస్‌ఐఆర్‌ పరిశీలకుడు రంగరాజన్‌ మోహన్‌ కుమార్‌ మంగళం అన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని సత్యభారతి గార్డెన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓటు బచావో.. దేశ్‌ బచావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది వంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. నవంబర్‌ ఒకటిన ఢిల్లీలోని రాంలీల మైదానంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీ పోరాటానికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌, పీసీసీ కోఆర్డినేటర్‌ అప్సర్‌ యూసుఫ్‌ జాహి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌ రెడ్డి, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ రజిత, మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, జాతీయ యువ నాయకుడు సంతోష్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, విజయభాస్కర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, కిషన్‌ నాయక్‌, మైపాల్‌ రెడ్డి, అనంత్‌రెడ్డి, రాంచంద్రా రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

ఏఐసీసీ ఎస్‌ఐఆర్‌ పరిశీలకుడు రంగరాజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement