కుల్కచర్ల: మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో ఈ నెల 30న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు పీడీ ప్రవీణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓ వాసుచంద్ర
దోమ: ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములిచ్చిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద న్యాయం జరిగేలా చూస్తామని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓ వాసుచంద్ర తెలిపారు. మంగళవారం మండలంలోని దిర్సంపల్లిలో రైతులతో సమావేశమై ప్యాకేజీపై చర్చించారు. భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చంద్రకిరణ్
బంట్వారం: భూ భారతి రీ సర్వేతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పెండాల్య చంద్రకిరణ్ అన్నారు. మంగళవారం కోట్‌పల్లి మండలం బుగ్గాపూర్ రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే సమయంలో రైతులు తప్పని సరిగా ఉండాలన్నారు. మొదట గ్రామ శివారు భూమి, తర్వాత గ్రామ కంఠం భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తారన్నారు. పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లకు కొలతలు చేస్తారన్నారు. టైటిల్ ఆధా రంగా సర్వే నంబర్లను గుర్తించి, డిజిటల్ సర్వే చేస్తారన్నారు. ఇందుకు రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరేష్‌కుమార్, జీపీఓలు లవకుమార్, నారాయణ, జూనియర్ అసిసెంట్ బాలరాజ్, రైతులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ శ్రీనివాస్
మోమిన్‌పేట: మండలంలో చేపట్టిన జలసిరి పనులను వెంటనే పూర్తి చేయాలని డీఆర్‌డీఓ శ్రీ నివాస్ సూచించారు. మంగళవారం చక్రంపల్లి, దేవరంపల్లి, అంరాధికలాన్, రాళ్లగుడుపల్లి, కే సారం, గోవిందాపూర్, సయ్యద్ అల్లీపూర్ తదితర గ్రామాల్లో చేయూత లబ్ధిదారుల ఎంపిక, జలసిరి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఎండిన బోరుబావులను రీచార్జ్ చేయాలన్నారు. సా మాజిక ఇంకుడు గుంతలు, ఫాం పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సృజనా సాహిత్య, ఏపీఎం మధుకర్, ఏపీఓ శంకర్, టీఏలు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు
సాగు చేయాలి
మంచాల: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే 15శాతం బోరు బావులు ఎండిపోయాయని, భవిష్యత్‌లో మరో 40 శాతం ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. భూగ ర్భ జలాలు తగ్గిపోయి సాగు నీరే కాదు, తాగు నీటి సమస్య కూడా తీవ్రరూపం దాల్చనుందన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సురేష్ పాల్గొన్నారు.


